క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాట్లాడటం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించుకోగలమని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న తెలుగు మహాసభల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి.. పిల్లలతో ప్రతి రోజూ బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని అన్నారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాలని సూచించారు. డిజిటల్ రంగంలో మాతృ భాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read : హైడ్రా కీలక నిర్ణయం.. ఇకపై హైడ్రా గ్రీవెన్స్, వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్!!
తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలని చెప్పారు. పాలన, అధికార వ్యవహారాలు మాతృభాష తెలుగులో జరగాలన్నారు. కొత్త సాంకేతికత, కార్యక్రమాలను మాతృభాషలోనే చేపట్టాలని సూచించారు. వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉందని.. దాదాపు 70 శాతం ఆంగ్ల పదాలే ఉంటున్నాయన్నారు. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్య ఉండాలని అభిప్రాయపడ్డారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అమలు చేయాలని.. ప్రాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలని చెప్పారు.
Read Also : బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ప్రియురాలి కోసం యువకుని దారుణహత్య!!
న్యాయస్థానాల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలని.. కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులో ఉండాలని చెప్పారు. అన్ని భాషల్లోకెల్లా తెలుగు భాష మధురమైనదని.. ఆ భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా హెటెక్‌సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్‌లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు దేశవిదేశాలకు చెందిన 2 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతున్న పలువుర్ని సత్కరించారు.
ఇవి కూడా చదవండి ;
- రోడ్డు భద్రత అవగాహనపై బైక్ ర్యాలీ.. 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
- రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కార్ కసరత్తు.. దశల వారీగా విక్రయానికి నిర్ణయం!!
- ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
- సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు.. రైతు భరోసాకు కొత్త రూల్స్!
- ఇకపై దేవాలయాలలో విజయ నెయ్యి మాత్రమే వాడాలి: తెలంగాణ ప్రభుత్వం