ప్రస్తుతం ఉన్న రియాల్టీ షో లలో మంచి పేరు ఉండి అందరు దృష్టిలో కూడా పడుతూ నిన్ను లాభాలను మూట కొట్టుకుంటుంది ఈ బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఇప్పటికే నాలుగు ఐదు భాషలలో రియాల్టీ షో తొ టీవీలలో కూడా ప్రసారం అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ రియాల్టీ షోలు అనేవి తెలుగులో ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుని ఎనిమిదవ సీజన్లోకి అడుగుపెట్టి దాదాపుగా ఆరో వారం కావస్తుంది. అలాగే మరోవైపు హిందీ బిగ్ బాస్ 18వ సీజన్ ప్రారంభమైంది.
బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులు కూడా టీవీకి అతుక్కుని మీరు చూస్తూ ఉన్నారు. అలాగే హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ బయట ఎలా ఉన్నా సరే లోపల మాత్రం అందరూ ఒకే సమయానికి లేగవాలి బిగ్బాస్ చెప్పినట్లు చేయాలి. అలా చేయకపోతే కచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తుంది. హౌస్ లోకి వచ్చే ముందు వాళ్ళ ద్వారా బిగ్ బాస్ కొన్ని రూల్స్ అనేవి చెప్తుందట. ఈ రూల్స్ ప్రకారం బిగ్ బాస్ లో ఏదైనా తప్పు చేసినా అలాగే బిగ్ బాస్ మాట వినకపోయినా వీటితోపాటుగా ఏదైనా సిల్లీ రిజన్స్ తో బిగ్బాస్ హౌస్ నుండి వెళ్లడానికి ప్రయత్నిస్తే పెద్ద శిక్షలే ఉంటాయి అట. అంతేకాకుండా 25 లక్షలు పరిహారం ఇప్పించుకుంటారట. ఇవన్నీ ముందే బిగ్ బాస్ రూల్స్ కింద వాల్ల చేత సైన్ చేయించుకుంటారు.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఒక వింత ఘటన జరిగింది. హౌస్ లోకి వచ్చినటువంటి కంటెస్టెంట్ లో ఒకరు బిగ్బాస్ హౌస్ నుండి ఒత్తిడి భరించలేక పారిపోయాడు. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 జరుగుతుంది. ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కుషాల్ టాండన్ అనే వ్యక్తి బిగ్బాస్ హౌస్ నుండి పారిపోవడానికి చూశాడు. అక్కడ ఒత్తిడి భరించ లేనంటూ బిగ్బాస్ గోడకి ఉన్న ఫెన్సింగ్ ని దాటుకొని మరీ బయటకు వెళ్ళాడు. ఇతను వెళుతున్నప్పుడు తోటి కంటెస్టెంట్స్ తొ పాటు బిగ్బాస్ వాయిస్ ద్వారా కూడా వెనక్కి రమ్మని,దిగమని బ్రతిమిలాడారు.అయినా కూడా అతను వినలేదు.