Uncategorized

సిక్సులతో వీరవిహారం చేసిన శాంసన్... భారీ స్కోర్ నమోదు చేసిన ఇండియా

బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడవ టి20 లో సంజు శాంసన్ సిక్సులతో వీరవిహారం చేస్తున్నాడు. కేవలం 47 బంతుల్లోనే 111 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు. చాలా రోజులుగా సంజు శాంసన్ పై చాలా విమర్శలు అనేవి వచ్చాయి. ఎన్ని అవకాశాలు ఇస్తున్న సరే వాటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో అందరి నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నిటికీ దీటుగా ఇవ్వాలా సెంచరీ చేసి అందరి నోర్లు మూయించాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 8 సిక్సులతో అలాగే 11 బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మరో వైపు సూర్యకుమార్ యాదవ్ సైతం 5 సిక్సులు 8 బౌండరీలతో 75 పరుగులు చేసి భారీ స్కోర్ కి ఇద్దరు చేరావేశారు.

ధీంతో భారీ దిశగా స్కోర్ అనేది వెళ్ళింది. తరువాత హార్దిక్ పాండ్యా కేవలం 18 బంతుల్లోనే 47 పరుగులు చేయడం దీంతోపాటుగా రియాన్ పరాగ్ కూడా కేవలం 13 బంతుల్లోనే 34 పరుగులు చేయడం తొ ఇండియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటర్స్ 22 సిక్సులు కొట్టి ఏకంగా 297 పరుగులు చేశారు. ఈ మ్యాచులో ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడారు. ఇండియా తరఫున ఎక్కువ రన్స్ చేసిన మ్యాచ్ ఇది. దీంతో ఇండియా అనేది కొత్త రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ టి20 లలో ఇదే బెస్ట్ స్కోర్. ఈ మ్యాచ్ హైదరాబాదులో జరగగా ప్రతి ఒక్క తెలుగు ఆడియోస్ అలాగే ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.

Back to top button