
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క రాజకీయ నేత కూడా తమ తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. ఇక తాజాగా రోడ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని బలగరువు లో పర్యటించిన పవన్ కళ్యాణ్ దాదాపుగా వంద కిలోమీటర్ల మేరా 120 రోడ్లకు శంకుస్థాపన చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు.
నేను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు బంద్..టికెట్ రేట్లు పెంచం
మొన్నటి వరకు 250 మంది ఒకచోట ఉంటే రోడ్లు వేసేవారు కానీ ఇవాళ ఒక గ్రామంలో 100 మంది ప్రజలు ఉన్నా రోడ్డు వేయాలని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం అనేది సజావుగా జరిగిపోతుందని తెలియజేశారు. కాబట్టి ప్రజల గురించి ఇంతగా ఆలోచించే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రోడ్ల విషయంలో కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలియజేశారు.
హీరోలకు ప్రత్యేక చట్టం ఉందా.. హంతకుడు అ్లలు అర్జున్‌ను లోపలేస్తే తప్పేంటీ!
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక నాయకుడు కూడా తమకు సంబంధించినటువంటి శాఖలలో తమ పనిని పూర్తి చేసుకుంటూ అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్క మంత్రి లేదా ఎమ్మెల్యే అందరూ కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని మార్గదిష నిర్దేశాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితుల గురించి అధికారులను అడిగి సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు.