ఆంధ్ర ప్రదేశ్

అప్పుడు దువ్వాడ, ఇప్పుడు వల్లభనేని వంశీ - కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న జగన్‌

వైఎస్‌ జగన్‌ రాజకీయం.. కుటుంబాలను చీల్చేస్తోంది. దంపతుల మధ్య చిచ్చు పెడుతోంది. వైసీపీ పాలిట్రిక్స్‌కు ఇప్పటికే కొందరు నేతలు బలయ్యాయి. అందుకు ఉదాహరణ… దువ్వాడ శ్రీనివాస్‌. ఇప్పుడు.. వల్లభనేని వంశీ ఫ్యామిలీలోనూ చిచ్చు పెట్టబోతున్నారు జగన్‌. ఆ దంపతుల మధ్య మనస్పర్థలు సృష్టించబోతున్నారు.

వైసీపీ గన్నవరం ఇంఛార్జ్‌గా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే… పలు కేసుల్లో నాలుగు నెలలుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది. రేపో, మాపో జైలు నుంచి బయటకు వచ్చినా… ఆయన ఇప్పట్లో రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరగలేని పరిస్థితి. ఈ క్రమంలో.. వైసీపీ కొత్త ప్లాన్‌ చేసింది. వంశీ భార్య పంకజశ్రీకి… గన్నవరం ఇంఛార్జ్‌గా బాధ్యతలు ఇస్తామన్న ప్రతిపాదన పెట్టింది వైసీపీ. అయితే.. ఇది వంశీని ఇష్టం లేనట్టు సమాచారం. తన భార్యను రాజకీయాల్లో దింపాలన్న ఆలోచన ఆయనకు లేదట. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా… దువ్వాడ శ్రీనివాస్‌ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు చాలా మంది. 2024 ఎన్నికలకు ముందు దువ్వాడ కుటుంబంలోనూ జగన్‌ చిచ్చు పెట్టారని అంటున్నారు. ఆనాడు దువ్వాణ శ్రీనివాస్‌ భార్య వాణికి టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఎన్నికల్లో టికెట్‌ కూడా ఆమె ఇస్తామని చెప్పంది. కానీ… ఎన్నికలకు ముందు… టికెట్‌ను దువ్వాడ శ్రీనివాస్‌కు ఇచ్చారు. దీంతో.. ఆ కుటుంబంలో వివాదం మరింత ముదిరిందని… సన్నితులు చెప్తున్నారు. ఇక.. నందిగాం సురేష్‌ విషయంలోనూ జగన్‌ ఇదే స్ట్రాటజీ వాడుతున్నారట. ఆయన భార్యకు కూడా ఇలాంటి హామీలే ఇచ్చారట.

వైసీపీ నేతలు కేసులు ఇరుక్కుని.. పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిన తర్వాత.. వారికి ఏదో మంచు చేస్తున్నట్టుగా… వారి భార్యలను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్‌ జగన్‌. దీని వల్ల రాజకీయంగా సింపతీ క్రియేట్‌ చేసుకోవాలన్న ప్లాన్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే.. జగన్‌ రాజకీయాలకు.. ఆ కుటుంబాలు నాశనం అవుతున్నాయని ప్రత్యర్థులు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో..? తెలియదు గానీ.. ఉదాహరణతోపాటు… సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెగ ప్రచారం చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు.

Back to top button