
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షం ముప్పు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రతిరోజు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఇంతలోనే వాతావరణ శాఖ మరొక సంచలనం విషయాన్ని తెలపడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా… మరో రెండు అల్ప పీడనాలు, ఒక వాయుగుండం ఏర్పడడానికి రెడీ అవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయంగా అనిపిస్తుంది. ఈ వారం అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడంతో పాటుగా వరదలు కూడా తప్పేలా లేవు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రతిరోజు కూడా అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ వర్షాలు పడడంతో.. ప్రజలు విరక్తి చెందుతున్నారు. దాదాపు ఆగస్టు నెల ప్రారంభం మొదలుకొని నేటి వరకు కూడా వర్షాలు ఆగలేదు. ఈ వర్ష ప్రభావంతో పంటలు నాశనం అవుతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : DSC అభ్యర్థులు అలర్ట్.. 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ!
అసలే నేటి నుండి దసరా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తులు కూడా ఈ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు రాష్ట్రాలలో కూడా త్వరలో తుఫాను ముప్పు కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD కీలక హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ముందుగానే అధికారులు సూచిస్తున్నారు. నేడు లేదా రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా ఇరు రాష్ట్రాలలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్స్ కు కాల్ చేయాలని కోరారు.
Read also : ఖాళీగా తిరుమల కొండ… కీలక వ్యాఖ్యలు చేసిన అధికారులు!