Homeతెలంగాణకారెక్కిన ఇద్దరు ఇండిపెండెంట్లు

కారెక్కిన ఇద్దరు ఇండిపెండెంట్లు

పటాన్ చెరు, క్రైమ్ మిర్ర‌ర్:బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో బ‌లం పెంచుకుంటుంది. ఇద్ద‌రు ఇండిపెండెంట్‌కౌన్సిల‌ర్లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు శుక్ర‌వారం వెలువ‌డ్డ విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలలోని 10వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీలలోని 2వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సార లావణ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

 

Most Popular

Recent Comments