
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మానవ హక్కులను కాపాడడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా నేరాల నియంత్రణ, నేరస్తులను పట్టుకోవడంలో నిమగ్నమై ముందుచూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. కానీ విజయవాడ నగరంలో శాంతిభద్రతలను కాపాడవలసినటువంటి పోలీసులే నడిరోడ్డుపై గొడవ పడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో నిధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ వీరిద్దరు కూడా నడిరోడ్డుపై విచక్షణ రహితంగా కొట్టుకున్నారు.
Read also : GST 2.O ఎఫెక్ట్!… భారీగా పెరగనున్న IPL టికెట్ల ధరలు
అసలు వివరాల్లోకి వెళితే… అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్ వద్ద ఎవరో తెలియని ఒక పురుషుడు అలాగే మహిళా మధ్య గొడవ జరుగుతున్నట్లు కానిస్టేబుల్ కోటేశ్వరరావుకు సమాచారం అందగా వెంటనే అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్లి చూడగానే ఆ మహిళతో గొడవ పడుతున్న వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ గా గుర్తించాడు. అప్పటికే పెద్ద గొడవ అవుతున్నట్లు గ్రహించిన కోటేశ్వరరావు.. గొడవ ఆపాలని శ్రీనివాస్ నాయక్ పై చేయి చేసుకున్నారు. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి.. చివరికి వీరిద్దరూ ఘోరంగా నడిరోడ్డుపై గొడవపడ్డారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల ను కూడా సస్పెండ్ చేశారు.
Read also : ఢిల్లీని వణికిస్తున్న యమునా నది!.. 63 ఏళ్లలో ఇది మూడోసారి?