HomeసినిమాPriyanka Nalkari: తప్పు చేశా.. అనుభవిస్తున్నా.. తెగ బాధపడుతున్న చబ్బీ బ్యూటీ!

Priyanka Nalkari: తప్పు చేశా.. అనుభవిస్తున్నా.. తెగ బాధపడుతున్న చబ్బీ బ్యూటీ!

తెలుగు ప్రేక్షకులకు నటి ప్రియాంక నల్కరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు తెలుగు సీరియల్స్‌ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించిన ఆమె, ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం పొందలేకపోయింది. ‘ఆహ్వానం’, ‘మేఘమాల’, ‘మంగమ్మ గారి మనవరాలు’, ‘శ్రావణ సమీరాలు’ వంటి సీరియల్స్‌ లో నటించిన ప్రియాంక, తర్వాత యాంకర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గెటప్ శ్రీనుతో కలిసి ‘సినిమా చూపిస్తా మావా’ కార్యక్రమంలో కనిపించింది.

పలు సినిమాల్లో నటించినా..

సినిమాల్లో కూడా ఆమె పలు పాత్రలు చేసింది. ‘అందరి బంధువయ’, ‘శివ మనసులో శృతి’, ‘కిక్ 2’, ‘హైపర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 3’ సినిమాలో కూడా కనిపించింది. అయితే తెలుగులో పెద్ద అవకాశాలు రాకపోవడంతో తమిళ్ పరిశ్రమ వైపు అడుగులు వేసింది.

తమిళంలో మంచి గుర్తింపు

తమిళంలో ప్రసారమైన ‘రోజా’ సీరియల్ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సీరియల్ ద్వారా ఆమెకు తమిళనాడులో భారీ గుర్తింపు వచ్చింది. రోజా పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరై, అక్కడ టాప్ టెలివిజన్ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది.

తన తప్పులతోనే కెరీర్ నాశనం

తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను చేసిన కొన్ని నిర్ణయాల వల్లే కెరీర్‌కు నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగాలంటే మధ్యలో బ్రేక్ తీసుకోకూడదని, తాను అదే తప్పు చేశానని చెప్పింది. ఇప్పటికీ తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ప్రియాంక తెలిపింది. చాలామంది తాను విదేశాల్లో స్థిరపడిపోయానని భావిస్తున్నారని, కానీ తాను ఇప్పటికీ భారతదేశంలోనే ఉంటున్నానని చెప్పింది. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయి ఆదరణ పొందాలని కోరుకుంటున్నానని చెప్పింది.

తన కెరీర్‌ను తానే దెబ్బతీసుకున్నాననే భావన ఇప్పటికీ ఉందని, కానీ, ఇకపై మంచి అవకాశాలు వస్తే మళ్లీ బలంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రియాంక నల్కరి వెల్లడించింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు