
చిట్యాల, క్రైమ్ మిర్రర్ : చిట్యాల మండల టీయుడబ్ల్యూజే (హెచ్-143) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం జరిగిన ఆసంఘం సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిట్యాల మండల అధ్యక్షుడిగా కారంపూరి మధు (హెచ్ఎంటీవీ), ఉపాధ్యక్షుడుగా బొడిగె విజయ్ కుమార్ (వార్త రూరల్), ప్రధాన కార్యదర్శిగా వాసా రామ్మోహన్ (వార్త టౌన్), కోశాధికారి గా చెన్నోజు చంద్రశేఖర్ (ప్రజాజ్యోతి) కార్యదర్శిగా అంతటి శ్రీను (టీవీ9) లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నిక కార్యక్రమానికి పరిశీలకులుగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు మూడ వేణు,చిర్రబోయిన మల్లేష్, నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్ము యాదగిరి లు వ్యవహరించారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు యూనియన్ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన అధ్యక్షుడు మధు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ యూనియన్ ని అందరి సహకారంతో బలోపేతం చేస్తామని తెలిపారు. ఎన్నికకు సహకరించిన యూనియన్ ప్రతినిధులకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని జిల్లా ప్రతినిధులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జిట్టా నరేష్, కొల్లోజు శ్రీకాంత్, మెండె వెంకన్న, రేగొండ వేణుమాధవ్, గుండ్లపల్లి వెంకన్న, చెరుపల్లి శ్రీనివాస్, మూడ వెంకటాద్రి, కాలిన శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.