Thursday, March 19, 2026
Homeతెలంగాణమంచు దుప్పటి కమ్ముకున్న తుక్కుగూడ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన దారులు

మంచు దుప్పటి కమ్ముకున్న తుక్కుగూడ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన దారులు

మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉదయం 6 గంటల నుండి పొగ మంచు దుప్పటి ల కమ్ముకుంది. శ్రీశైలం ప్రధాన రహదారి పై వెళ్ళే వాహనాలకు ఇబ్బందిగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు కూడా మంచు కొమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా నెమ్మదిగా రాక పోకలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పొగ మంచు కారణంగా ఎంతోమంది వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఆయా ఘటనలలో దేశవ్యాప్తంగా చాలా మంది వరకు మృతి చెందారు. కాబట్టి తెల్లవారుజామున ప్రయాణాలు కొనసాగించేటువంటి వారు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తూ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప పొగ మంచు కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది అని పేర్కొన్నారు.

Read also : Ayodhya Ram Mandir: మార్చి 19న అయోధ్యకు రాష్ట్రపతి, ఏప్రిల్ 30 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి!

Read also : Union Budget 2026: ఇరాన్‌ చాబహార్‌ పోర్టుకు నో బడ్జెట్, కేంద్రం కీలక నిర్ణయం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments