
TTD New Dining Hall: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. రోజూ సుమారు 60 నుంచి 80 వేల వరకు భక్తులు వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. రద్దీ సమయాల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువగానూ ఉంటుంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ఉచిత భోజనాన్ని తినకుండా వెళ్లరు. రోజూ ఇక్కడ వేలాది మంది భక్తులకు భోజనాన్ని అందిస్తారు. తాజాగా ఈ భోజనశాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అందేంటంటే..
అన్నదానానికి మరో భోజనశాల!
ప్రస్తుతం తిరుమలలో ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఒకేసారి 4 వేల మంది భోజనం చేసేలా నాలుగు డైనింగ్ హాళ్లు అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాయి. రోజుకు 70 నుంచి 75 వేల మంది భక్తులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. ఇటువంటి సమయాల్లో ఈ కేంద్రం వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయి. దీంతో వెయ్యి మంది ఒకేసారి భోజనం చేసేలా మరొక హాలు అవసరమని టీటీడీ అధికారులు అంచనా వేశారు. వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి సమీపంలోని గ్యాస్ ప్లాంట్‌ను గోగర్భం డ్యాం దగ్గరికి తరలిస్తున్నందున, ఈ ప్రదేశంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిసింది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అన్నప్రసాద విభాగం అధికారులతో కలిసి తాజాగా కొత్త భోజనశాల నిర్మాణ ప్రదేశాలన్ని పరిశీలించారు.
Read Also: పిఠాపురంలో ఉప్పాడ గోడ చిచ్చు – టీడీపీ, జనసేన మధ్య నలిగిపోతున్న అధికారులు