
Trump warns BRICS: బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేశారు. వాణిజ్య సుంకాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేశారు. బ్రిక్స్ కూటమిని చిన్న గ్రూప్ గా అభివర్ణించిన ఆయన.. డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే, 10 శాతం అదనపు సంకాలు ఎదుర్కోక తప్పదన్నారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించి జీనియస్ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాలపై తన అక్కసు వెళ్లగక్కారు.
బ్రిక్స్ దేశాలకు సుంకాల ముప్పు తప్పదు!
డాలర్ ను సవాల్ చేస్తే బ్రిక్స్ దేశాలకు పన్నుల ముప్పు తప్పదని ట్రంప్ హెచ్చరించారు. “బ్రిక్స్ అనే ఓ చిన్న గ్రూప్ ఉంది. అది చాలా వేగంగా ఉనికిని కోల్పోతుంది. వారు మాత డాలర్ ఆధిపత్యాన్ని నియంత్రించాలని చూస్తున్నారు. మా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వారికి బలంగా కొట్టబోతున్నాం. వారిపై టారిఫ్ లు విధిస్తాం. మాతో గేమ్స్ వద్దు. అమెరికా డాలర్ కు గ్లోబర్ రిజర్వ్ స్టేటస్ ఉంది. దాన్ని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. డాలర్ విలువ తగ్గడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించం. మా కరెన్సీ స్టేటస్ పడిపోతే, మేము దాన్ని ఓటమిగా భావిస్తాం” అని ట్రంప్ వెల్లడించారు.
10 దేశాలతో బ్రిక్స్ కూటమి
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత ఈ లిస్టులో ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా చేరాయి. మొత్తం పది దేశాలను కలి బ్రిక్స్ ప్లస్ గా పిలుస్తున్నారు. ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిక్స్ తో పాటు బ్రిక్స్ దేశాలకు మద్దతు ఇస్తున్న దేశాలకు 10 శాతం అదనపు సుంకాలను విధిస్తామన్నారు. అమెరికా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Read Also: నిమిష ప్రియ కేసు.. భారత విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు!