
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- చాంపియన్స్ ట్రోఫీ 2025 నేడే ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో మరికొన్ని మ్యాచ్లు దుబాయ్లో నిర్వహించనున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ మొదటి రోజు ఆటోలో భాగంగా పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ పాకిస్తాన్ దేశంలోని కరాచీ స్టేడియంలో జరుగుతుంది. టోర్నీ తొలి మ్యాచ్ లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో పాకిస్తాన్ దేశం పై ట్రోల్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ దేశంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంటే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఏమాత్రం స్టేడియంలో కనిపించడం లేదు. మొదటగా ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహిస్తున్నట్లు తెలియగానే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మరియు క్రికెట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఈసారి పాకిస్తాన్ కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంటుందని సోషల్ మీడియాలో చాలా వీడియోలు చేసి వైరల్ చేశారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ తీరు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఒక్క అభిమాని కూడా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కనిపించలేదు. ఉన్నారంటే గొప్పగా లెక్కపెడితే కనీసం ఒక 500 మంది కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇది క్రికెట్ పై మీకు ఉన్న అభిమానం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1. బాధితునిపై మద్దూర్ ఎస్సై దాడి… పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేసిన పలు సంఘాల నాయకులు!