Homeక్రైమ్దొడ్లపహాడ్‌లో మాంత్రికుడి మోసాలు?. .లక్షల రూపాయలు దండుకున్నాడన్న ఆరోపణలు

దొడ్లపహాడ్‌లో మాంత్రికుడి మోసాలు?. .లక్షల రూపాయలు దండుకున్నాడన్న ఆరోపణలు

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలం దొడ్లపహాడ్ గ్రామంలో మాంత్రికుడిగా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ పూజలు, క్రతువులు, సమస్యల పరిష్కారం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామంలో తన ఇల్లు గుడిలా నిర్మించుకుని ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించి ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తానని హామీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇంకా, గ్రామాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రజల్లో భయం, భక్తి మేళవించిన వాతావరణం సృష్టిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతని ఇంటి పక్కల నివసించే వారు కూడా భయబ్రాంతులకు గురవుతూ బహిరంగంగా మాట్లాడటానికి వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది.ఆ వ్యక్తి ప్రధానంగా తూర్కాయంజల్ ప్రాంతంలో నివసిస్తాడని, అక్కడి నుంచి గ్రామానికి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని సమాచారం. గ్రామ పెద్దలు, కొంతమంది యువకులు కలిసి అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అధికారులు స్పందించి నిజానిజాలు వెలికితీసి, ఎలాంటి మోసపూరిత చర్యలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

వివాహ బంధంతో ఒక్కటైన విరోష్

కెఎల్ఆర్ నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు