
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పురోహితులు హనుమంత శర్మ (70) బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… సూరారం గ్రామానికి చెందిన హనుమంతు శర్మ బుధవారం మధ్యాహ్నం తమ స్వగృహంలో ఆకస్మిక స్థితిలో ఉండడం గమనించిన తమ కుమారుడు దిలీప్ శర్మ వెంటనే సమీపంలోని మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. హనుమంత్ శర్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also : మేము ముగ్గురం కలిసే ఏపీని అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు
పాకిస్తాన్ అమ్మాయిల గుండెల్లో అభిషేక్ శర్మ.. గూగుల్లో తెగ వెతికేస్తున్నారంట?





