క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- ఐపీఎల్ లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ఫేవరేట్ ఫ్రాంచైజీ గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుకు దూసుకుపోతుంది. ఒకవైపు ఫాన్స్ తో మరోవైపు జట్టులోని ఫైరింగ్ క్రికెటర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విపరీతంగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన ద్వారా ఏకంగా ఈ SRH జట్టును బాయ్‌కాట్ చేయాలి అంటూ ఫ్రాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఇంగ్లాండ్ టూర్ THE HUNDRED వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అయినటువంటి అబ్రార్ అహ్మద్ ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. దాదాపు 2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజనులు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది ఒక సిగ్గుచేటని సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్మీ ని భారతదేశాన్ని ఎగతాళి చేసినటువంటి వ్యక్తిని మీరు కొనుగోలు చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ అనుబంధమైనటువంటి ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ప్లేయర్లను అవాయిడ్ చేస్తాయని ఇటీవల వార్తలు వచ్చినా కూడా అవి అబద్ధమని ఈరోజు నిరూపించారు . తాజాగా సన్‌రైజర్స్ లీడ్స్ X ఎకౌంటు సస్పెండ్ కూడా అయింది. దీంతో ఓనర్ అయినటువంటి కావ్య మారన్ పై అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో జరగబోతున్నటువంటి ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును బాయ్‌కాట్ చేయాలి అని సోషల్ మీడియా లో ఇండియన్ క్రికెట్ అభిమానులు హైలెట్ చేస్తున్నారు.
Gas Booking Rules: పండుగల ముందు గ్యాస్ ఆందోళన
Supreme Court: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా?
