
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన భారతదేశంలోని పలు ముఖ్య నగరాల ట్రాఫిక్ సమస్యలు ఎన్నిసార్లు బయటకు చెప్పినా కూడా అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు. మనదేశంలో అన్ని నగరాల కంటే ముఖ్యంగా బెంగుళూరు లో ట్రాఫిక్ జామ్ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ అనుకున్న సమయం కంటే ట్రాఫిక్ దాటడానికి మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. తాజాగా భారత వ్యోమగామి శుభంశు శుక్ల కూడా ఈ బెంగుళూరు ట్రాఫిక్ పై ఇదే విధంగా మండిపడ్డారు. తాజాగా బెంగళూరులో ప్రయాణించిన మన భారత వ్యోమగామి కి అక్కడి ట్రాఫిక్ చిరాకు తెప్పించింది అని అన్నారు. బెంగళూరులోని ట్రాఫిక్ కష్టాలపై సరదాగా నవ్వుతూనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలిపారు. బెంగళూరులోని ట్రాఫిక్ ను దాటడం కన్నా అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులభం అంటూ శుక్ల స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. అతను మారతహళ్లి నుంచి ఈవెంట్ కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ సమయం పట్టింది అని అతను నవ్వుతూనే స్టేజ్ పై ఉండి ప్రజలకు నగరంలోని ట్రాఫిక్ సమస్యను హైలైట్ చేశారు. ఈ వ్యోమగామి శుక్ల కూడా చివరికి బెంగళూరు ట్రాఫిక్ సమస్యలపై మాట్లాడుతూ సెటైర్లు వేయడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. ఇప్పటికైనా అధికారులు మరి ఏ విధంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
Read also : “తిరుమలలో బిచ్చగాడంటా”.. వివాదంలో చిక్కుకున్న యాంకర్..?
Read also : Cockroach Coffee (VIDEO): చచ్చిన బొద్దింకలతో కాఫీ! ధరెంతో తెలుసా..?





