నల్లగొండ, క్రైమ్ మిర్రర్ : నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటిలోని 1వ వార్డుకు స్వతంత్య్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ శ్వేత సుధాకర్ పోటి చేసి గెలువడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ శ్వేత సుధాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. శ్వేతసుధాకర్ ప్రజలకు అవసరమైన హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకున్నాయి.
దీంతో. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీలను కాదని శ్వేతసుధాకర్‌ను గెలిపించుకున్నారు. విజయం సాధించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నన్ను గెలిపించుకున్న వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చిన స్పందిస్తానని శ్వేతసుధాకర్ ఈసందర్భంగా తెలిపారు.









