తెలంగాణ

న్యూ ఇయర్ వేడుకలలో విషాదం.. మద్యం తాగి బిర్యానీ తినడంతో మృతి!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా ఓ వ్యక్తి మద్యం తాగి ఆ తర్వాత బిర్యాని తినడంతో మృతి చెందాడు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలు తన కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే… మేడ్చల్ జిల్లా, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి భవాని నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాండు అనే 53 సంవత్సరాల వ్యక్తి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లలో భాగంగా ఫుల్ గా మద్యం తాగి ఆ తరువాత బిర్యానీ తిన్నారు. రెండు ఒకేసరి తీసుకోవడం వల్ల బెడిసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నూతన సంవత్సరంలో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇక మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయాచోట్ల 15 మంది వరకు అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టుగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తెలిపినా కూడా చాలామంది ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోలేదు.

Read also : 2026లో బయలుదేరి 2025లో ల్యాండ్ అయిన 14 విమానాలు

Read also : కాలేశ్వరం దర్గా వద్ద అపశృతి.. విద్యుత్ తీగలకు తగిలి యువకుడు మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button