
హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి ఏరియాలలో వ్యభిచారి కార్యక్రమాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాలలో వ్యభిచార కార్యకలాపాలపై మీమ్స్, వీడియోలను షేర్ చేస్తూ విస్తృత ప్రచారం జరుగుతుంది. దీంతో కొంతమంది మహిళలు కూకట్పల్లిని అడ్డాగా చేసుకుని వ్యభిచారానికి పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు వ్యభిచారం చేసే మహిళని బుక్ చేసుకోవడానికి వెళ్లి తనతో గొడవపడి చివరికి హాస్పిటల్ పాలైన ఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకివెళితే మధు గౌడ్ అనే యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే మధు గౌడ్ సోషల్ మీడియాలో చూసి కూకట్పల్లి ఏరియాలలో వ్యభిచారం చేసే మహిళలు ఉంటారని అక్కడికి వెళ్ళాడు. ఈ క్రమంలో రవళి అనే మహిళను కలసి బుక్ చేసుకోనేందుకు ఆమెతో భేరసారాలు సాగించాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవళి తన బంధువుకి ఫోన్ చేసి మధు గౌడ్ పై ఉన్నవి లేనివి చెప్పింది. దీంతో రవళి బంధువు తన అనుచరులతో కలిసి వచ్చి మధు గౌడ్ పై కత్తితో దాడి చేశారు. దీంతో గాయపడిన మధు గౌడ్ ను స్థానికులు దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి మధు గౌడ్ ద్వారా వివరాలు తెలుసుకొని రవళి ని అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. అనంతరం పోలీసులు రవళి బంధువు మరియు అతడి అనుచరులను కూడా అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.