రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నందున నేటి నుంచి 3 రోజుల పాటు వాహనాల రాకపోకల్లో మార్పులు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.పనుల నేపథ్యంలో రామకృష్ణాపూర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్గం గుండా కాకుండా, ఆర్కే- 4 గడ్డ రోడ్డు మీదుగా గోదావరిఖనికి వెళ్లాలని సూచించారు. ఈ తాత్కాలిక మార్పును గమనించి ప్రజలు, వాహనదారులు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు.
ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం…! ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు..
గడ్డపోతారం ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్ర్బాంతి…! మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి…
