
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- TPCC చీఫ్ మహేష్ కుమార్ బీసీ రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది అని వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఎల్లుండి జరగబోయేటువంటి రాష్ట్ర బంద్ కు మరింత బలం చేకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు బంద్ కు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపిన తర్వాత హైకోర్టును సమర్థిస్తూ తీర్పును ఇవ్వడంతో అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు విధించినటువంటి స్టేను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ముందుకు వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ సందర్భంలోనే 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎలాంటి ములుపు తిరుగుతుందో అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also : మత్యాద్రి దేవస్థానంలో హుండీ లెక్కింపు..!
Read also : మన ప్రధాని రూటే వేరు.. దెబ్బకి పాకిస్తాన్ కూడా దడుచుకుంది : మంత్రి లోకేష్