Sunday, February 15, 2026
Homeక్రీడలురేపే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. బలాలు, బలహీనతలు ఇవే?

రేపే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. బలాలు, బలహీనతలు ఇవే?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం ఎవరు గెలుస్తారు అని.. ఈ మ్యాచ్ ఉత్కంఠంగా ఉండబోతుంది అని ముందుగానే అనుకుంటూ ఉంటారు. ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అని ఇప్పటినుంచే భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీలంక వేదికగా ఎన్నో ట్విస్టులు తరువాత ఎలా అయితేనేం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో టీమిండియా చాలా బలంగా కనిపిస్తుంది.

మంత్రి పదవి ఇస్తే ఓకే.. లేదంటే సీఎం అవ్వడానికి సిద్ధం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మరోవైపు పాకిస్తాన్ జట్టు కూడా బలంగానే ఉంది. ఇప్పటికే పలుసార్లు పాకిస్తాన్ జట్టు తన చెత్త బుద్ధిని చూపిస్తూ.. మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తామని ఎన్నో హాస్యకరమైనటువంటి వార్నింగులు చేసింది. చివరికి ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రేపు శ్రీలంకలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ కొనసాగనుంది. ఇప్పటివరకు టి20 మ్యాచ్లలో పాకిస్తాన్ పై భారత్ ఎక్కువ విజయాలు నమోదు చేసింది. కానీ ఈమధ్య టీం ఇండియా టాప్ ఆర్డర్ ఓకే అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ లో మాత్రం కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ప్రతి ఒక్కరు కూడా అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. ఇక రేపు జరగబోయేటువంటి ఈ ఆసక్తికరమైన పోరులో విజయం ఎవరి సొంతం అవుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments