తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అల్లు అర్జున్ మరియు సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈమధ్య అల్లు అర్జున్ సినిమా పుష్ప సందర్భంగా తొక్కిస లాటలో భాగంగా రేవతి అనే మహిళా సంధ్య థియేటర్ వద్ద చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగజేసుకొని బెన్ఫిట్ షోలు మరియు టికెట్లు రేట్లు పెంపకం అనేది నేను ఉన్నంతకాలం జరగదని చెప్పేశారు.
చెరువులో దూకి ఎస్ఐ, కానిస్టేబుల్ సూసైడ్.. కామారెడ్డి జిల్లాలో కలకలం
ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోలు మరియు డైరెక్టర్లు అలాగే నిర్మాతలు కూడా దిల్ రాజ్ నేతృత్వంలో దాదాపుగా 36 మంది సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగునున్నారు. ఇందులో హీరోలు వెంకటేష్, అక్కినేని నాగార్జున, సిద్దు జొన్నలగడ్డ, సాయి తేజ్, కిరణ్ అబ్బవరం, నితిన్, వరుణ్ తేజ్, శివ బాలాజీ తో పాటుగా దర్శకులు త్రివిక్రమ్, అనిల్, హరిశ్ శంకర్, వంశీ, బాబీ తదితరులు కలవనున్నారు.
వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్!… కొత్త స్కాన్ ఏర్పాటు?
ఇక నిర్మాతల విషయానికి వస్తే అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగ వంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ తదితరులు నేడు తెలంగాణ ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మరియు సినిమా టికెట్లు అలాగే బెనిఫిట్ షో ల గురించి మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సమావేశంలో వేటి గురించి చర్చిస్తారనేది ప్రతి ఒక్కరులోను ఉత్కంట నెలకొంది.