Wednesday, February 18, 2026
Homeజాతీయంమీ పిల్లలు ముఖ్య కాదా అంటూ పూనమ్ కౌర్ ట్వీట్.. వాళ్ళని ఉద్దేశించి అందా..?

మీ పిల్లలు ముఖ్య కాదా అంటూ పూనమ్ కౌర్ ట్వీట్.. వాళ్ళని ఉద్దేశించి అందా..?

తెలుగులో ఒకప్పుడు వరుస చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ ఈ మధ్య సినిమాల్లో కంటే ఎక్కువగా వివాదాలు, కాంట్రవర్సీలతో తన అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాగే సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ అంశాలు వంటివాటిపై స్పందిస్తోంది.

కాగా తాజాగా నటి పూనమ్ కౌర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ కాంట్రవర్సీ గా మారింది. ఈ స్టోరీలో క్యారెక్టర్ ధ్రువీకరణ కోసం చిన్నపిల్లలను ఉపయోగించుకోవడం సరికాదని, అలాగే మీ పిల్లలాగే ఇతరుల పిల్లలు ముఖ్యం కాదా అంటూ పేర్కొంది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read More : కొండా సురేఖపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్ టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలసి తిరుమల దేవస్థానం ని సందర్శించి మొక్కు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో వీరివెంట పవన్ కళ్యాణ్ కుమార్తెలు ఆద్య కొణిదెల, పలీనా అంజని కూడా ఉన్నారు. దీంతో వీరిని ఉద్దేశించి పూనమ్ కౌర్ స్టోరీ షేర్ చేసిందా..? అంటూ కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments