
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆసియా కప్ లో భాగంగా నేడు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేడు ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ ను చూడడానికి చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా చాలామంది భారత అభిమానులు పాకిస్తాన్ తో మ్యాచ్లు ఎందుకు ఆడుతున్నారు అంటూ బీసీసీఐపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు చేసిన దాడులు మర్చిపోయారా?.. అని ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ను ప్రత్యర్థి జట్టుగా చూడడం కూడా మంచిది కాదు.. ఆ టీం ను ఇండియా తో పోల్చకూడదని కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
Read also : ఘటనపై రాజకీయం చేయను… ఆ తర్వాతనే అరెస్ట్ చేస్తాం : సీఎం స్టాలిన్
అయితే మరోవైపు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని… అలా చేస్తే కానీ వారికి బుద్ధి రాదని లేదంటే.. మ్యాచ్ సందర్భంలో వాళ్ళు చేసేటువంటి చేష్టలకు ప్రతి ఒక్కరికి చాలా కోపం వస్తుందని భారత క్రికెట్ టీంకు భారత అభిమానులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య రెండుసార్లు మ్యాచ్ జరగగా రెండింటిలోనూ ఇండియా నే ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్లలోనూ పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయినా కానీ కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్లు ఇండియన్ టీం ను రెచ్చగొడుతున్నారు. చివరికి వాళ్లే అవమానం పాలవుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్ పై వరుసగా మూడోసారి విజయం సాధించి.. గట్టి బుద్ధి చెప్పి కప్పు సొంతం చేసుకోవాలని మన ఇండియన్ టీం ఆలోచిస్తుంది. మరోవైపు వరుస పరాజయాల బదులు ఈసారి మ్యాచ్ విజయం సాధించి ఇండియా పై పగ తీర్చుకోవాలని పాకిస్తాన్ భావిస్తుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అందరు కూడా ఈ ఇరు టీంలు ఫైనల్ కు రావడం చాలా మందికి కిక్ ఇస్తుంది అని అంటున్నారు. మరి ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది కామెంట్ చేయండి.
Read also : బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక : తహసిల్దార్ వీరాభాయ్