క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో:
స్థానిక సంస్థల ఎన్నికలపై అప్‌డేట్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించే అవకాశం ఉందని, సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయని వార్తలు వస్తున్నాయి.
బెట్టింగ్ యాప్స్ కేసు: బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా నటి శ్రీముఖి, నిధి అగర్వాల్ విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్: అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
విద్యుత్ కోతలు: కొన్ని ప్రాంతాలలో 10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పత్తి కొనుగోలు కేంద్రాలు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.





