
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఢిల్లీలో నేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మెగా యాక్షన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను ప్రతి ఒక్కరూ ఎంతలా ఆదరించారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ లీగ్ లాంటి లీగ్ ఏ దేశంలో కూడా అంతగా ప్రాముఖ్యత పొందలేదు. ఈ ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కి ప్రతి ఏడాది కూడా కొన్ని వేల కోట్ల రూపాయలను లాభంగా తెచ్చిపెడుతుంది. పురుషుల ఐపీఎల్ క్రేజీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల క్రితం మహిళల లీగ్ ను కూడా ఇదే తరహాలో ప్రారంభించారు. ఇక ఈరోజు ఢిల్లీ వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ ఆక్షన్ జరగనుంది. ఈ ఆక్షన్ లో ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 277 మంది ఈరోజు ఆక్షన్ లో పాల్గొంటున్నారు. ఇందులో 1994 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్ లో రాణించిన దీప్తి శర్మ, రేణుక సింగ్ అలాగే కొంతమంది మహిళలు భారీ ధర దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో అతి చిన్న వయసుగల వారు కూడా ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయర్ షబ్మిమ్ 37 సంవత్సరాల ఓల్డెస్ట్ క్రికెటర్ గా ఉన్నారు.
Read also : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఏపీ లో దంచికొట్టనున్న భారీ వర్షాలు!
Read also : Panchayat Elections: ఇవాళ్టి నుంచి మొదటి విడత నామినేషన్లు





