
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు రెండవ టి20 మ్యాచ్ జరుగునుంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెల్బోర్న్ వేదికగా నేడు మ్యాచ్ జరిగే సమయానికి 93% వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ఆక్యు వెదర్ పేర్కొనడం వల్ల ఇవాళ కూడా మ్యాచ్ జరిగే అవకాశం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మెల్బోర్న్ వేదికగా వర్షం మధ్యలో ఆగిపోతే తడిని ఆరబెట్టే టెక్నాలజీ అయితే ఈ గ్రౌండ్ లో ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. కాబట్టి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంటుంది అని ఈ వెధర్ ద్వారా క్రీడ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోగా రెండవ టి20 కూడా అదే వర్షం కారణంగా నిలిచిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. కాగా ఈ మెల్బోర్న్ వేదికగా భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు సార్లు తడపడగా చెరో రెండు మ్యాచ్లు గెలిచారు. దీంతో ఒకవైపు ఇండియన్ ఫ్యాన్స్ మరింత ఆందోళనలో ఉన్నారు. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోగా రెండో మ్యాచ్ లోనైనా భారత్ విజయం సాధిస్తే చూడాలని ఆశగా ఎదురుచూసినటువంటి ఫాన్స్ కైతే చాలా నిరాశ ఎదురయింది అని చెప్పాలి. మరి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ జరుగుతుందో లేక వర్షం కారణంగా నిజంగానే ఆగిపోతుంది అనేది మరో మూడు గంటల పాటు వేచి చూడాల్సిందే.
Read also : అమెజాన్ లో లక్ష రూపాయలకు పైగా ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి చేదు అనుభవం!
Read also : టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా పెరుగుతుంది.. వీటిపై చట్టాలు తీసుకురావాలి : చిరంజీవి
 
				 
					
 
						 
						




