క్రీడలు

నేడే చివరి వన్డే… తెలుగు ప్లేయర్ అవుట్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు చివరి మూడో వన్డే ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి రెండు వన్డే మ్యాచ్లలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో నేటి మ్యాచ్ అంతంత మాత్రంగానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు జట్లలో కొత్త ప్లేయర్స్ ఎంట్రీ ఇచ్చారు. భారత జట్టు తరుపున తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అలాగే హర్షదీప్ సింగ్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్ మరియు ప్రసిద్ధి కృష్ణను తీసుకువచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా తరపున నాధన్ ఎలీస్ అనే కొత్త బౌలర్ను తీసుకువచ్చారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ కి దిగింది. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం కాగా ఈ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ చివరి వన్డే మ్యాచ్ లోనైనా విజయం సాధించి ఫ్యాన్స్ ను కాస్త తృప్తిపరిచేలా చేయాలని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నేడు ఈ మ్యాచ్ సిడ్నీలో జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. త్వరలోనే భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించి టి20 సిరీస్ అయినా కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ ఇండియన్ క్రికెట్ జట్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడుతున్న సందర్భంగా ఈ రోజైనా వీరిద్దరూ రాణించాలని కోరుతున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also : మరో బలమైన తుఫాన్ … ఈ వర్షాలు ఎప్పటికి తగ్గునో?

Read also : త్వరలోనే దేశమంతటా మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం : ప్రధాని మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button