
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఇప్పటికే టెస్ట్ సిరీస్ మరియు వన్డే సిరీస్ పూర్తయిపోయాయి. ఇక ఇవాల్టి నుంచి ఇరు జట్ల మధ్య టి20 సిరీస్ పోరు జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకోగా, వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇక చివరి మూడవ వన్డే విశాఖపట్నంలో భారత అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించిగా అదే జోష్ లో T20 సిరీస్ ని కూడా దక్కించుకోవాలని చూస్తుంది. ఇక ఈరోజు రాత్రి 7 గంటలకు భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టీ20 జరుగునుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే దక్షిణాఫ్రికా పై టీ20 టీం ఇండియా అనే డామినేషన్ ఎక్కువగా కొనసాగిస్తుంది.
Read also : ప్రపంచంలో ది “బెస్ట్ ఫుడ్” హైదరాబాద్ బిర్యానీ!
అంతేకాకుండా ఇప్పటి భారత టి20 జట్టులోని ఆటగాళ్లు అందరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 31 t20 మ్యాచ్ లు జరగగా అందులో భారత్ 18 మ్యాచ్లు గెలిచింది. ఇక సౌత్ ఆఫ్రికా 12 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ మాత్రం ఫలితం లేదు. ఇవాళ సాయంత్రం కటక్ లో జరిగేటువంటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకే ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి అని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ కటక్ స్టేడియంలో ఆడిన రెండు టీ20 లోను దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు టి20 లో మరింత బలమైన జట్టుగా ఉండడంతో కచ్చితంగా భారత్ గెలుస్తుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇవాళ కెప్టెన్ గిల్ మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read also : ప్రపంచంలో ది “బెస్ట్ ఫుడ్” హైదరాబాద్ బిర్యానీ!





