
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవ్వడంతో ఇరుదేశాల ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా భారత్ ఫ్యాన్స్ అయితే ఈ మ్యాచ్ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. దీనికి ముఖ్య కారణం దాదాపు చాలా రోజుల తర్వాత భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ లాగా విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడమే. ఇప్పటివరకు భారత్ మరియు ఆస్ట్రేలియా ఇరుదేశాలు కూడా కలిపి 152 సార్లు పోటీ పడగా ఆస్ట్రేలియన్ 84 మ్యాచ్లలో గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాలో మన భారతదేశానికి రికార్డ్స్ పరంగా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. ఆస్ట్రేలియా పిచ్ లు భారత జట్టు ఆటగాళ్లకు అంతగా అనుకూలించవు. మొత్తంగా 54 వన్డేల్లో కేవలం 14 సార్లు మాత్రమే మనం గెలిచాం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇవాళ జరగబోయేటువంటి మొదటి వన్డే మ్యాచ్ పెర్త్ లో జరుగుతుండగా అక్కడ టీమ్ ఇండియాకు బ్యాటింగ్ చేయడం కాస్త కష్టం అనే చెప్పాలి. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ అయినటువంటి కెమెరూన్ గ్రీన్ కూడా కండరాల చికిత్స కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యారు. మరి కొంతమంది క్రికెట్ విశ్లేషకులు తెలుపుతున్న ప్రకారం నేను జరగబోయే మ్యాచ్ ఆస్ట్రేలియా కి కాస్త అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనేది కామెంట్ చేయండి.
Read also : వెండి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
Read also : పాక్‌లోకి ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే: రాజ్‌నాథ్