వైరల్సినిమా

దర్శక దీరుడి జన్మదినం నేడు… ప్రతి సినిమా బ్లాక్ బస్టర్

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సినిమాలు గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి రాజమౌళి అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఒక రాజమౌళికి మాత్రమే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి అనే సినిమాతో పాన్ ఇండియా అనే టాగ్ ను సృష్టించాడు రాజమౌళి. ఇండియన్ సినిమాలను నేడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అంటే దానికి కారణం రాజమౌళి అనే చెప్పాలి. అలాంటి రాజమౌళి పుట్టినరోజు నేడు. ఇప్పటివరకు రాజమౌళి నిర్మించిన 12 సినిమాలు ప్రతి ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించి భారీ కలెక్షన్లను కూడా రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

రాజమౌళి నిర్మించిన 12 సినిమాలు
1. స్టూడెంట్ నెంబర్ -1
2. సింహాద్రి
3. సై
4. చత్రపతి
5. విక్రమార్కుడు
6. యమదొంగ
7. మర్యాద రామన్న
8. మగధీర
9. ఈగ
10. బాహుబలి 1
11. బాహుబలి 2
12 RRR

ఇప్పటివరకు రాజమౌళి తీసిన ఈ 12 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాయి. ఎవరు నిర్మించలేనటువంటి సినిమాలు తీసి ఎన్నో రికార్డులు సృష్టించారు. ఒక ఈగతో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటిది చాలా సునాయసంగా ఒక ఈగని పెట్టి సినిమాను తీసి ప్రపంచ దర్శకులు అందర్నీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. అలాంటి రాజమౌళి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలోనే రాజమౌళి తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం మరో రికార్డ్. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే చాలామంది ప్రముఖులు దర్శకదీరుడు రాజమౌళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

దర్శక ధీర రాజమౌళికి ఇవే మా ప్రత్యేక బర్త్డే విషెస్
🇭‌🇧‌🇩‌ 🇷‌🇦‌🇯‌🇦‌🇲‌🇴‌🇺‌🇱‌🇮‌ 🇬‌🇦‌🇷‌🇺‌

Read also : సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి నేటికి 12 ఏళ్లు..!

Read also : మ్యూజిక్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ దంచికొడుతున్నాడు… 39 బంతుల్లోనే సెంచరీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button