
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కెసిఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి తన తండ్రి కెసిఆర్ జీవిత చరిత్రను తెలిపారు. కెసిఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. తాజాగా ఎక్స్ వేదికగా తన తండ్రి కెసిఆర్ చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. 60 సంవత్సరాల లో జరగని పనులను కేసీఆర్ చాలా విజయవంతంగా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేశారని రాసుకొచ్చారు. కేవలం ఒక్క తెలంగాణ, తెలంగాణలోని ప్రజల కొరకే అయినా జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల కొరకే నిత్యం ఇప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఇక కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ప్రజలకు కరువు లేకుండా చేశారని అన్నారు. అలాంటి కెసిఆర్ గురించి అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ నేతలకు జీవిత కాలం కూడా సరిపోదు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మరికొద్ది సేపట్లో కాలేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న సందర్భంలోనే… కేటీఆర్ ఎక్స్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు. మరి దీనిపై ఇంకా కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా స్పందించలేదు. ఏది ఏమైనా కూడా తన నాన్న పనితీరును కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోవాలంటే జీవితకాలం సరిపోదు అని కేటీఆర్ అన్న వ్యాఖ్యలను.. కాంగ్రెస్ ఏ విధంగా కొట్టి పారేస్తుందో వేచి చూడాల్సిందే.
సింగర్ మంగ్లీ అరెస్ట్!బర్తే డే పార్టీలో గంజాయి
లోకల్ కాదు… నేషనల్ లెవెల్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆంధ్ర సీఎం!..