
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మన దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి నూతన సంవత్సర వేడుకలు తాజాగా తిరుమలలోనూ కూడా ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం వేల తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మారు మోగిపోయింది. శ్రీవారిని చూడడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆలయ ప్రాంగణంలో ఉండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని భక్తులందరూ కూడా సందడి చేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేల పలువురు ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. మరోవైపు రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా ఈ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. చాలామంది తమ ఇంటి వద్దనో లేక బార్ వద్దనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి అలాగే నమ్మకంతో ఏకంగా తిరుమలలోనే ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. దీంతో ఎన్నడూ లేనటువంటి విధంగా కేవలం మందు లేదా క్రాకర్స్ తోనే సంబరాలు చేసుకోకుండా భక్తితోను ఇలా సంబరాలు చేసుకోవచ్చు అని కొంతమంది స్వామి వారి భక్తులు నిరూపించారు. దీంతో తిరుమల క్షేత్రం మరింత ప్రసిద్ధిగాంచింది. స్వామివారి ఆలయం ప్రాంగణంలోనే ప్రతి ఒక్కరూ కూడా గోవింద నామస్మరణతో లడ్డు ప్రసాదాలు అలాగే ఆలింగనం చేసుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని ఆనందంతో హావా భావాలను పంచుకుంటున్నారు.
Read also : గొప్పలు, సోకుల కోసమే ఈ జనరేషన్ జీవిస్తుంది.. యువత మేలుకో?
Read also : మైలార్‌దేవ్‌పల్లి సీఐ సత్యనారాయణను సన్మానించిన బీఆర్‌ఎస్ నాయకులు





