ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణ

Tirumala: టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఎలా?

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఈ పర్వదినం సందర్భంగా లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ముందుగానే దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూలైన్‌లలోని రద్దీని నిరంతరం పరిశీలిస్తూ, అవసరాన్ని బట్టి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.

వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకమైనదైనందున ఈ సందర్భంగా బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఆలయంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులు ఎక్కువసేపు క్యూలో నిలబడి ఇబ్బంది పడకుండా, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంలోనే శ్రీవారి భక్తులను ఉద్దేశించి టీటీడీ మరో కీలక నిర్ణయం వెల్లడించింది.

కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో, ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా 2026 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను విడుదల చేసింది. భక్తులు సంవత్సరమంతా శ్రీవారి దివ్య చిహ్నం తమ ఇంట్లో ఉండాలనే కోరికతో ఈ క్యాలెండర్లు, డైరీలను విస్తృతంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ 12 పేజీల క్యాలెండర్లు, 6 పేజీల క్యాలెండర్లు, టేబుల్-టాప్ క్యాలెండర్లు, డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను అందుబాటులో ఉంచింది. వీటిపై శ్రీవేంకటేశ్వర స్వామివారి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు దివ్య చిత్రాలున్న ప్రత్యేక కేలండర్లను కూడా ఏర్పాటు చేసింది.

తిరుమలలోని సేల్స్ కౌంటర్లు, పరిపాలన భవనం ఎదుట ఉన్న సెంటర్, గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో ఈ క్యాలెండర్లు సులభంగా లభిస్తున్నాయి. అలాగే తిరుచానూరులోని టిటిడి ప్రచురణ విభాగం స్టాల్స్‌లో కూడా క్యాలెండర్లు విక్రయిస్తున్నారు.

కేవలం తిరుమల, తిరుపతిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ క్యాలెండర్లు, డైరీలు భక్తులు కొనుగోలు చేసేలా సదుపాయం కల్పించారు. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని ఎస్వీ ఆలయాలు, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, వేలూరు, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరు కళ్యాణమందపాల్లో కూడా 2026 సంవత్సరపు క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే భక్తులకు పోస్టల్ విభాగం ద్వారా ఇంటికే పంపించే విధంగా టీటీడీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. టిటిడి అధికారిక వెబ్‌సైట్లు ద్వారా బుకింగ్ చేయవచ్చు. అవసరమైతే డిమాండ్ డ్రాఫ్ట్ పంపి కూడా ఆర్డర్ చేసుకోవచ్చని టీటీడీ వివరించింది. అయితే రవాణా ఛార్జీలు భక్తులు తపాలా శాఖకు ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం టీటీడీ పేర్కొన్న ఫోన్ నంబర్‌ 0877-2264209 ద్వారా సంప్రదించవచ్చు.

ALSO READ: ❤️తండ్రి ప్రేమ అంటే ఇదే❤️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button