
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఎంతోమంది ఇండియన్ అభిమానులు వెయిట్ చేస్తున్నటువంటి ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ముఖ్య కారణం మన తెలుగు బిడ్డ తిలక్ వర్మా అని చెప్పడంలో ఎటువంటి సందేహం. మొదటినుంచి చివరి వరకు కూడా చాలా అద్భుతంగా రాణించి చివరికి విజయాన్ని అందించాడు. దీంతో పాకిస్తాన్ జట్టును ఓడించడానికి తెలుగు వాడు చాలు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్ధులపై వరుసగా మూడోసారి గెలిచి క్రికెట్ అభిమానులను ఇండియన్ టీం అలరించడంలో తోపుగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిచిన అనంతరం ఎన్నో వింతలు జరిగాయి. అందులో మొదటగా ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే టీమిండియా ప్లేయర్లు అందరూ కూడా తెగ సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ కు ముందు అందరూ అనుకున్నట్టుగానే ఆసియా కప్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా పూర్తిగా నిరాకరించింది. ఎందుకంటే ACC & PCB చైర్మన్ నక్వి పాకిస్తాన్ వ్యక్తి కావడంతో ఈ వ్యక్తి నుంచి ట్రోఫీని తీసుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భారత్ ప్రకటించింది. అయితే మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ రన్నర్ అప్ చెక్ యూఎస్డి75,000 తీసుకున్నారు. ఇక ఇండియన్ ప్లేయర్లు అందరూ కూడా ఎటువంటి అవార్డులు, మెడల్స్ లాంటివి అసలు తీసుకోలేదు. ఫైనల్ గా సూర్యతో ఇంటర్వ్యూ, ట్రోఫీ ప్రజెంటేషన్ లేకుండానే సెర్మని అనేది జరిగింది.
Read also : మూడు రోజులపాటు భారీ వర్షాలు… అల్పపీడనమే కారణం!
మరోవైపు ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న ఏకైక టీం గా భారత్ చరిత్ర సృష్టించింది. ట్రోఫీ చేతిలో లేకుండానే ప్లేయర్స్ అందరూ కూడా ట్రోఫీ ఉందన్నట్లుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటానే ఫోటోలకు ఫోజులిస్తూ, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించారు. నిజానికి చెప్పాలంటే ఇండియన్ అభిమానులకు కూడా ఇదే కావాలి. పాకిస్తాన్ జట్టుతో తల పడక ముందు వరకు కూడా.. అసలు ఆ జట్టుతో ఆడకండి అని సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత పాకిస్తాన్ పై ఆడిన మ్యాచ్ లు అన్నీ కూడా గెలిచి ఇండియన్ అభిమానులకు సంతృప్తిని కలిగించారు.
Read also : ఎంజీబీఎస్ ఎందుకు మునిగింది.. మూసీ వరదలకు కారణం ఏంటి?