
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మరో 40 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ దగ్గర పడింది. దీంతో ఇప్పటికే ప్రముఖ నగరాలలో ఉద్యోగ పరంగాను లేదా పనుల నిమిత్తం వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇప్పటికే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకున్నారు. మరి మిగిలిన వారందరికీ ఈసారి అధిక మొత్తంలో డబ్బులు వృధా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అధిక చెల్లింపు చిల్లు తప్పదు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలలో విద్యార్థులు, ఉద్యోగులు, కూలి పనుల నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా సెలవులు ఉండడం కారణంగా వారి సొంత గ్రామాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే ప్రధాన నగరాలలో అలాగే రైళ్లు మరియు విమానాల్లో టికెట్స్ అనేవి పూర్తిగా బుక్ అయిపోయాయి. పండుగకు రెండు నెలలు ముందుగానే ఈ టికెట్స్ అన్ని బుక్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటికే సీట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి వెయిటింగ్ లిస్టు వందల్లో కనిపిస్తున్నాయి. దీంతో ఇదే పరిస్థితిని ఆసరాగా తీసుకునే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ రేట్స్ను ఇప్పటినుంచే పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ చార్జీల బస్సులను చూస్తుంటే అంత డబ్బును పెట్టి ప్రయాణాలు చేయలేమని అంటున్నారు. ఇదే సందర్భం లో బస్సు ప్రమాదాలు చూస్తుంటే ప్రయాణికులకు మరింత భయం కలుగుతుంది.
Read also : రైతుల ఒంటి మీద చొక్కా తీసి రోడ్డు మీద నిలబెట్టారు : జగన్
Read also : Karnataka Politics: రంజుగా మారిన కన్నడ రాజకీయాలు, సీఎం రేసులోకి హోంమంత్రి!





