
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.ఈ అల్పపీడన ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా IMD ప్రకటించింది. నేటి నుంచి రేపు ఉదయం 7:30 గంటలలోపు దాదాపు అన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు దంచి కొడతాయని, కాబట్టి ఈ క్రింది జిల్లాల ప్రజలు చాలా అలెర్ట్ గా ఉండాలని సూచించింది.
ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలు :-
1. నిజామాబాద్
2. జగిత్యాల
3. నిర్మల్
4. సిరిసిల్ల
5 భూపాలపల్లి
6. మహబూబాబాద్
7. ములుగు
8. మెదక్
9. కామారెడ్డి
10. వికారాబాద్
11. వరంగల్
12. సంగారెడ్డి
13. మహబూబ్నగర్
14. నాగర్ కర్నూల్
15. వనపర్తి
ఈ 15 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మిగతా జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాబట్టి రేపటి వరకు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని.. వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు నమోదు అయ్యే అవకాశం కష్టంగా కనిపిస్తుంది అని అధికారులు చెప్పడంతో ప్రజలు కూడా ఈ వర్షాల కారణంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : కలెక్షన్లలో OG రికార్డ్… పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటిసారి!
Read also : శిలాఫలకం ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలి : మందుల సత్యం