Wednesday, March 25, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఈ వైసీపీ పార్టీ భగవంతుడిపైన పగబట్టేసింది : డిప్యూటీ సీఎం

ఈ వైసీపీ పార్టీ భగవంతుడిపైన పగబట్టేసింది : డిప్యూటీ సీఎం

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిపారు అని.. వీళ్ళు మనుషులా లేక పశువుల అంటూ గతంలో ఎన్నికల సమయం అప్పుడు తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయితే అదే విషయం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోరుగా కొనసాగుతుంది. తాజాగా తిరుమలలో కల్తీ వ్యవహారంపై కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ వైసీపీ నాయకులు భగవంతుడిపై పగ పట్టారు అని అన్నారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్ తో కొన్ని కోట్ల లడ్డులు చేశారు అని.. అంతేకాకుండా అందులో కొన్ని అయోధ్య కూడా పంపారు అని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. అలాగే వీళ్ళు చెప్పినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్షాలు కూడా దొరికాయి అని స్పష్టం చేశారు. భగవంతుడిపై పగబడితే వాళ్లు కచ్చితంగా సర్వనాశనం అయిపోతారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also :

Psychological Horror: ఇదెక్కడి థ్రిల్లర్ సినిమారా బాబూ.. కలలో కూడా వెంటాడే సీన్లు

సాధ్యంకాని హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments