
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ఫాన్స్ ను ఆ జట్టు తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. మూడు మ్యాచ్లలోనూ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలవడంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేయగా… 222 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ జట్టు ఎక్కడ కూడా గెలిచేలా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కనిపించారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా మొదటిలో తలపడింది. 76 పురుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఒకానొక దశలో పీకల్లోతు కష్టాల్లోకి పడింది. అలాంటి పరిస్థితులలో ఎక్కడ కూడా బెదరకుండా మూని ఒంటరి పోరాటం చేస్తూ చివరిగా సెంచరీని నమోదు చేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు చివరికి 221 పరుగులు చేసింది. చేజింగ్లో పాకిస్తాన్ జట్టు 114 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్లలో పరాజయాన్ని అందుకొని పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. మరోవైపు ఆసియ కప్ లో భాగంగా ఫైనల్ కు చేరుకున్న పాకిస్థాన్ పురుషుల జట్టు ఇండియా పై ఓడిపోవడం తో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు.
Read also : లిక్కర్ పై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేదే లేదు : సీఎం
Read also : దేశమంతా “ZOHO” పిలుపే… అట్లుంటది ప్రధాని మోదీతో..!