క్రీడలు

మూడవ వన్డేలో మన తెలుగు ప్లేయర్ దూరం అవ్వడానికి కారణం ఇదే!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:-టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య జరిగేటటువంటి మూడవ వన్డే కు దూరమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా బీసీసీఐ నితీష్ కుమార్ రెడ్డి ఆడక పోవడం పై క్లారిటీ ఇచ్చింది. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కి గాయం అవ్వడం కారణంగానే మ్యాచ్కు దూరం పెట్టామని తెలిపారు. అడిలైడ్ లో రెండవ వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి ఎడమతోడ కండరాలకు గాయం అయిన కారణంగా… నేడు జరగబోయేటువంటి మూడవ వన్డే కు ముందు అతడు ఫిట్నెస్ సాధించలేకపోవడంతోనే దూరం చేయాల్సి వచ్చింది అని తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి గాయంపై మెడికల్ టీం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుంది అని తాజాగా బీసీసీఐ నుంచి ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది. కాగా ఐపీఎల్లో సత్తా చాటిన ఈ యంగ్ క్రికెట్ ప్లేయర్.. వెంట వెంటనే అంతర్జాతీయ టి20లోకి, టెస్ట్ మ్యాచ్ లలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా.. సతీష్ కుమార్ రెడ్డి ని సెలెక్ట్ చేయడమే కాకుండా తుది జట్టులోకి కూడా తీసుకోవడంతో… ఒక తెలుగు క్రికెట్ ప్లేయర్ 3 అంతర్జాతీయ ఫార్మాట్లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆడిన మొదటి వన్డే మ్యాచ్ లో చివర్లో రెండు సిక్సులతో వీర విహారం చేస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. మరోవైపు బౌలింగ్ లో అవకాశాలు తక్కువ వస్తున్నప్పటికీ.. బౌలింగ్ పై మరింత ఫోకస్ చేయాలని తెలుగు అభిమానులు సతీష్ కుమార్ రెడ్డికి సూచిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఒక తెలుగు ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నాడు అని ప్రశంసిస్తున్నారు.

Read also : వడ్లు కొనుగోలు లేదు… రోడ్డు ఎక్కిన రైతన్నలు

Read also : AI పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్న టీడీపీ ఫాలోవర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button