
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- సాధారణంగా ప్రపంచంలో ఏదో ఒక దేశానికి ఒక స్పెషల్ అంటూ ఉంటుంది. ఒకటి ఆర్థిక పరంగాను, స్పోర్ట్స్ పరంగాను, రాజకీయ పరంగాను, టెక్నాలజీ పరంగాను, విద్య పరంగాను… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే దేశంలో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు అన్నీ కూడా ఉచితమే. ఆ దేశం పేరే UAE. అవును ఈ యూఏఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు లభించే ప్రభుత్వ పథకాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలో మరి ఏ ఇతర దేశాల్లో లేనటువంటి ఉచిత పథకాలు ఈ దేశంలోనే ఉన్నాయి.
మొరాయించిన మూసీ గేట్లు.. ఒకదానికి పూజ.. మరొకటి ఓపెన్!
ఇక ఈ యూఏఈ దేశంలో కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా తెలివైన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. మరోవైపు ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్యం, గర్భిణీలకు మరియు పిల్లలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇక మరో విశేషమేంటంటే ఉచితంగా కొంత భూమి ఇచ్చి వడ్డీ లేకుండా హౌస్ లోన్ ఇస్తారు. ఇక ఇంధన ధరలపై 85% వరకు నెలవారి రాయితీ కూడా ఇస్తున్నారు. అలాగే కొత్తగా పెళ్లయిన జంటలకు కూడా కొంత నగదు కూడా ఇస్తున్నారట. ఇలా మన భారతదేశంలో చేయాలంటే మాత్రం అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇప్పటికీ కేంద్రం ఇస్తున్నటువంటి కొన్ని పథకాలకు డబ్బు అనేది సరిపోవటం లేదు. కానీ మిగతా అన్ని దేశాల ప్రజలు కూడా యూఏఈ లాగా అందులో కొన్ని ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఇన్సూరెన్స్ కోసం.. కాళ్లు నరుక్కున్న డాక్టర్!