
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- పూరి జగన్నాథ్ మరియు చార్మి ఇద్దరు కూడా ఎన్నో సందర్భాలలో ఒకటిగా కనిపించారు. ఇద్దరి మధ్య ఏదో ఉంది అని సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వచ్చాయి. ఇక ఒకప్పటి హీరోయిన్ ఛార్మి చాలా కాలం నుంచి పూరి జగన్నాథ్ తో ట్రావెల్ అవుతూ వస్తూ ఉంది. మెహబూబా, రొమాంటిక్, లైగర్ అలాగే ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ మీదనే నిర్మించాడు. ఈ పూరి కనెక్ట్స్ అనే అనే బ్యానర్ లో చార్మి అలాగే పూరి జగన్నాధ్ ఇద్దరూ కూడా పార్ట్నర్స్ గా చేస్తున్నారు. త్వరలో భారీ బడ్జెట్ తో విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా తీస్తున్నారు. సినిమా కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ మీదనే నిర్మితమవుతుంది.
Read also : అధికంగా నీరు త్రాగుతున్నారా?.. అయితే జాగ్రత్త!
ఇవన్నీ ఇలా ఉండగా ఒకప్పుడు హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ తో ఎందుకు ఉంటుంది అని సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది… ఎన్నో రకాలుగా అనుమానాలు కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే అప్పట్లోనే పూరి జగన్నాథ్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. నాకు 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక లావు మహిళతో కనిపించినా లేదా ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో కనిపించిన ఇక్కడ ఎవరికీ సమస్య ఉండేది కాదు. ఇక్కడ చార్మి చాలా యంగ్ గా ఉంది కాబట్టి.. అందరూ కూడా మా మధ్య ఏదో ఉంది అని ఊహించుకుంటున్నారు అంటూ కామెంట్ చేశాడు. ఇకపోతే ఆకర్షణలు ఎక్కువ కాలం నిలబడవు.. నాకు ఛార్మి 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు. తను 20 ఏళ్ల వయసు నుంచి సినిమాలో ప్రొడ్యూసర్ గా రాణించాలనే కోరిక నాకు చెప్పడంతో… అబ్బాయిలా తగ్గకుండా కష్టపడే మనస్తత్వం తనకు ఉంది కాబట్టి ఇద్దరు కలిసి పనిచేస్తున్నామంటూ చెప్పుకోవచ్చు. ఈ రంగుల ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూడడం మామూలే అని అన్నారు. నేను ఎప్పుడూ కూడా అంతగా స్పందించను అని చెప్పుకొచ్చారు. ద పూరి మరియు చార్మి మధ్య స్నేహబంధం ఏ ఉంది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read also : 14 న రాష్ట్ర బంద్ కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలి : బీసీ నేత