
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ రోజుల్లో యువత అంతా కూడా పూర్తిగా మారిపోయారు. ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు ఎలా జీవించారో దానికి భిన్నంగా ఈరోజు వారి బిడ్డలు జీవిస్తున్నారు. 90s కు ముందు బ్రతికిన బతుకు వేరు.. 20స్ లో యువత బతుకుతున్న బతుకు వేరు. దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే అప్పటి రోజులు వేరు.. ఇప్పటి రోజులు వేరు. ఆ జనరేషన్ యువకులు బాగా కష్టపడి ఏదో ఒక పని చేసి భవిష్యత్తు తరాలు కష్టపడకుండా ఉండే విధంగా బాగానే ఆస్తులు సంపాదించి పెట్టారు. కానీ ఈ జనరేషన్ పిల్లలు మాత్రం తన తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి మొత్తం కాజేయడానికే జీవిస్తున్నారు అన్నట్లుగా అర్థమవుతుంది. తాజాగా ఒక హెల్తియన్స్ సర్వే వెల్లడించిన నివేదికలో ఈ జనరేషన్ యువకులు అందరూ కూడా గొప్పలు మరియు సోకుల కోసమే లోన్లు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. దాదాపు ఈ 2025 సంవత్సరంలోనే 27 శాతం మంది gen-z లు మెయిన్ గా ట్రిప్స్ మరియు కన్సల్ట్స్ వంటి లీజర్ యాక్టివిటీస్ కోసమే లోన్లు తీసుకున్నారట. ఇంకొంతమంది కాస్ట్లీ రెస్టారెంట్ ఫుడ్ తినడానికి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవడానికి, లగ్జరీ లైఫ్ స్టైల్ గా జీవించడానికి తీసుకున్నారట. మరి కొంతమంది స్మార్ట్ వాచ్, ఫోన్స్, లాప్టాప్స్ వంటి టేక్ థింగ్స్ కొనుగోలు చేయడానికి లోను తీసుకున్నారు అని వివరించి ఉంది. అయితే వీటన్నిటికీ మించి మరికొందరు మాత్రం తమకు ఉన్న అప్పు తీర్చేందుకు లోన్ల ద్వారా అప్పు చేసేవారు కూడా ఉన్నారు అని వెల్లడించింది.
Read also : Urea Supply: యూరియా సరఫరాపై అధికారుల ఫోకస్, యాప్ గురించి రైతులకు అవగాహన!
Read also : Pralay Missiles: రక్షణ రంగంలో కీలక ముందడుగు, ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం!





