
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మంత్రి నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వం పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రాజధాని అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని విధ్వంసం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు అని మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది రైతుల త్యాగ ఫలితమే నేడు మన రాజధాని అమరావతి అని లోకేష్ స్పష్టం చేశారు. ఆనాడే మన ప్రభుత్వాన్ని నమ్మి ఎంతో మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు. అలాంటి ఎంతో మంది రైతులు తమ భూమిని సైతం త్యాగం చేసిన వారిపై గత వైసిపి ప్రభుత్వం నానా తిప్పలు పెట్టింది అని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అని ఏ కార్యక్రమానికి వెళ్లిన చెప్తున్నారు కానీ ఒక ఇటుక కట్టిన పాపాన పోలేదు అని విమర్శించారు. ఒకవైపు రాజధాని లేకుండానే మరోవైపు మూడు రాజధానులు అంటూ కాలాన్ని గడిపారు అని.. జగన్ మాత్రం వైజాగ్ లో అద్భుతమైన ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారు అని.. 500 కోట్లు వృధాగా ఖర్చు చేశారు అని తెలిపారు. గతంలో అమరావతి రైతులు రాష్ట్రానికి ఒకే రాజధాని అంటూ 1631 రోజులు పాటు రైతులు ఉద్యమాలు చేశారు అని ఆనాటి రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు మంత్రి నారా లోకేష్. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమరావతి పనులలో వేగం పెరిగింది… త్వర త్వరగా పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని లోకేష్ స్పష్టం చేశారు.
Read also : Health: అవునా.. నిజమా!.. అప్పుడప్పుడూ తినడం మానేస్తే ఆరోగ్యానికి మంచిదేనట..
Read also : మరో రెండు రోజులు రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : హోం మంత్రి





