
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి సంఘటనలో దేశంలోని 30 మంది అమాయకుల ప్రాణాలు బలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై రాంగోపాల్ వర్మ ఉగ్రవాదులపై సెటైరికల్ ట్వీట్ చేశారు. పహల్ గాం లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 26 మంది చనిపోగా దేశమంతటా కూడా ఈ సంఘటన అందరిని కలిచి వేసింది. ఉగ్రవాదులు ఈ సందర్భంలో చంపిన తరువాత చనిపోయిన భార్యలకు వెళ్లి మోదీకి చెప్పుకోండి సవాలు విసిరారు. అయితే ఆ మహిళ నిజంగానే మోడీకి చెప్పడంతో ఇప్పుడు… ఆ ఉగ్రవాదులపై భారీగా కాల్పులు జరుపుతోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలవగా ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. దీంతో రాంగోపాల్ వర్మ ఆ ఉగ్రవాదులపై పంచ్ డైలాగులు విసిరారు. మోడీకి చెప్పుకోమన్నారు… ఇప్పుడు ఆ మహిళా నిజంగానే మోడీకి చెప్పింది. ఇప్పుడు మీరు బాగా అనుభవిస్తున్నారు అని రాంగోపాల్ వర్మ ఉగ్రవాదుల గురించి సెటైరికల్ ట్వీట్ చేశారు.
భారతదేశ పౌరులు 26 మంది అమాయకుల ప్రాణాలు ఈ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. దీంతో అప్పటినుంచి ఇండియా.. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎప్పటికప్పుడు ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా చాలా ఎదురు చూశారు. ఎప్పుడు ఎప్పుడు పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటిస్తుంది?.. ఎప్పుడు ఉగ్రవాదులను హతం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా… రాత్రికి రాత్రే ఇండియన్ ఆర్మీ తన పవర్ చూపించింది. నిజంగానే మోడీ తుఫాన్ కంటే నిశ్శబ్దంలో ఉండి మొత్తం కూడా నడిపించారు. ఉగ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్ చేసి వాళ్ళందరినీ కూడా మట్టికరిపించింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద మిస్సయిల్స్ దాడులతో పాకిస్తాన్ ఉగ్రవాదుల నివాస స్థలాలపై రాత్రికి రాత్రే దాడులు నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారత్ దే పై చేయి చెప్పాలి.