
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. అప్పట్లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి 10 ఏళ్ల అధికారంలో మొత్తం దోచేసుకున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దోపిడీని భరించలేకనే ప్రజలు తాజాగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ తెచ్చుకున్నారు అని తెలిపారు. పదేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా నేడు మా అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది అని అన్నారు. పదేళ్ల ముఖ్యమంత్రి నువ్వే మా అభ్యర్థి గురించి మాట్లాడుతుంటే అక్కడే మా అభ్యర్థి విజయం ఖరారు అయిందని స్పష్టం చేశారు. లెగిస్తే చాలు నవీన్ యాదవ్ రౌడీ రౌడీ అని అంటున్నారు… నిజంగా అతను రౌడీ అయితే గత ప్రభుత్వంలో అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరే బయటపెట్టి తీరాలి అని డిమాండ్ చేశారు. నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. కాగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు గెలుపు మా పార్టీది అంటే మా పార్టీదే అని ప్రతి ఒక్కరూ సవాల్ విసురుతున్నారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : గూగుల్ డేటా సెంటర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే!
Read also : కర్నూల్ ఘటన ఎఫెక్ట్.. జర్నీలు వద్దు బాబోయ్ అంటున్న ప్రజలు?





