ఆంధ్ర ప్రదేశ్

ఫైల్స్ క్లియరెన్స్ లో టాప్ లో ఉన్న మంత్రులు వీరే.. సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంక్ ఎంతంటే?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆయా మంత్రులు అందరికీ కూడా సరిగ్గా పనులు చేస్తూ.. ఎక్కడా పెండింగ్ లేకుండా ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి మంత్రికి కూడా కొన్ని ఫైల్స్ ఇచ్చి వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పని తీరుపై ఐటి శాఖ ప్రభుత్వానికి తాజాగా ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక్కొక్క ఫైల్ పూర్తి చేయడానికి ఎవరు ఎన్ని రోజుల గడువు తీసుకుంటున్నారు అని ఆ నివేదికలో స్పష్టంగా వివరించి ఉంది.

Read also : ఓటు హక్కు వినియోగించుకున్న మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

ఈ నివేదిక ప్రకారం డోల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు మరియు ఫరూక్ మంత్రులు టాప్ లో ఉన్నారు. వీరందరూ సగటున ఒక ఫైల్ కు రెండు రోజులు పాటు గడువు తీసుకుంటున్నట్లుగా నివేదికలో తెలిపి ఉంది. ఇక ఆ తరువాత స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ మూడు రోజులు పాటు గడువు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఇక తరువాత స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఫైల్ ను నాలుగు రోజులలో పూర్తి చేస్తున్నారు అని తెలిపారు. ఇక చివరి స్థానంలో మంత్రులు కొల్లు రవీంద్ర మరియు రాంప్రసాద్ రెడ్డి ఉన్నట్లుగా.. వీరు ఒక్కొక్క ఫైల్ కు దాదాపు 15 రోజులు పాటు గడువు తీసుకుంటున్నట్లు ఐటి శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఏ మంత్రి పనితీరు ఎలా ఉంది అనేది స్పష్టంగా నాయకులతో పాటు ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చివరి స్థానాల్లో ఉన్నటువంటి మంత్రులకు సీఎం హెచ్చరిక చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి.

Read also : మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మృతి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button